కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల దీక్ష అడ్డుకునేందుకే ఆ పార్టీ నేతల్ని గృహనిర్భందం చేస్తున్నారు. ఇప్పటికే కొల్లు రవీంద్ర నివాసం వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీర్చాలంటూ మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో శుక్రవారం ఆయన దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసేందుకే కొందరు ముఖ్యనేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు సహా పలువురు నేతలంతా గృహనిర్బంధంపై మండిపడుతున్నారు. ప్రజాసమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా అరెస్టులు చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.