ముగ్గురు టెన్త్ స్టూడెంట్స్ మిస్సింగ్

Update: 2019-10-11 14:35 GMT

చిత్తూరు నగరంలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. గురువారం ఉదయం స్కూలుకు వెళ్లినవారు ఇంటికి తిరిగిరాలేదు. వారంతా అసలు స్కూలుకే వెళ్లలేదని తెలుసుకుని పేరెంట్స్ షాకయ్యారు. పిల్లలు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వి.కౌసల్య, ఎ.ఢిల్లీబాబు, ఆర్‌.సౌమ్య.. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్. వీరంతా గిరింపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. దసరా సెలవుల తర్వాత వీరంతా గురువారం ఉదయమే ఇంటి నుంచి బయలుదేరారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి విచారించారు. అసలు స్కూలుకే రాలేదని తెలియడంతో వారి కోసం చాలా చోట్లా వెదికినా ఆచూకీ దొరకలేదు. ఇక మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News