కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలు పెరిగాయ్..

Update: 2019-10-12 06:39 GMT

మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీఏను 5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల డీఏ 12 నుంచి 17 శాతానికి పెరిగింది. దాంతో పాటు ట్రాన్స్‌పోర్ట్ (టీఏ) కూడా పెంచింది. ఈ రెండు పెంచిన కారణంగా ఉద్యోగుల జీతం రూ.810 నుంచి రూ.4,320 వరకు పెరగనుంది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు అర్బన్ సిటీస్‌లో పనిచేసే ఉద్యోగులకు టీఏ కనిష్టంగా రూ.1350 ఉండగా.. గరిష్టంగా రూ.7200 ఉంది. అలాగే చిన్న పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు టీఏ రూ.900 నుంచి రూ.3600 మధ్యలో ఉంది.

Similar News