హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పాము కలకలం సృష్టించింది. సడెన్‌గా పాము కనిపించడంతో పోలీసులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ పామును చాకచక్యంగా పట్టుకుని క్యాన్‌లో బంధించారు. ఆ తర్వాత పామును స్నేక్ సొసైటీ వారికి అందించారు.