విజయవాడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గూడ్స్ ఆటోలు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. జనం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఐతే.. మైనర్ డ్రైవింగ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీతారామ్‌పురం లాల్ బహుదూర్ శాస్త్రి వీధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.