ఏపీలో కొత్త మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 50 గ్రామ పంచాయితీలు, నగర పంచాయితీలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు గల అవకాశాలను పరిశీలించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని కోరింది. మొత్తం 13 జిల్లాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి.
గతంలో ప్రతిపాదనలు పంపాలని కోరినా.. ఎలాంటి స్పందన లేదని ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున నగర, గ్రామ పంచాయితీలను పురపాలక సంఘాలుగా మార్చేందుకు గల అవకాశాలను పరిశీలించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అందులో పేర్కొన్నారు.