చెట్టుకు కట్టేసి యువకుడికి గుండు కొట్టించిన..

Update: 2019-10-14 06:29 GMT

ఉత్తరప్రదేశ్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. భవానీ గంజ్‌లో యువకుడిపై మూకదాడికి పాల్పడ్డారు. చెట్టుకు కట్టేసి మరీ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. దెబ్బలకు యువకుడు సొమ్మసిల్లి పడిపోయినా అతి కిరాతకంగా ప్రవర్తించారు పోకిరీలు. అంతటితో ఆగక యువకుడికి గుండు కూడా కొట్టించారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎందుకు యువకుడిపై ఆకతాయిలు దాడికి తెగబడ్డారో విచారిస్తున్నారు. మరోవైపు యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News