గన్నవరం గాంధీబొమ్మ సెంటర్ వద్ద పండ్ల వ్యాపారులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కిషోర్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి మధ్య వ్యాపారలావాదేవీల్లో తలెత్తిన వివాదమే ఘర్షణకు కారణమని తెలుస్తోంది. ఒంటిపై గాయాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన కిషోర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.