ఆటో బోల్తా.. విద్యార్థి మృతి

Update: 2019-10-14 08:07 GMT

కర్నూలు జిల్లాలో జరిగిన ఆటో ప్రమాదం ఓ విద్యార్థి ఉసురు తీసింది. మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామ సమీపంలో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో చౌళహల్లి గ్రామానికి చెందిన గౌస్‌ అనే 7వ తరగతి విద్యార్థి చనిపోయాడు. మరో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News