ఇసుక అక్రమ రవాణా, టీడీపీ నేతలపై దాడులు, అక్రమ కేసుల బనాయింపులను నిరసిస్తూ.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఒక రోజు దీక్ష చేపట్టారు. పరిపాలనలో సీఎం జగన్ విఫలమయ్యారని విమర్శించారు. ఇసుక దొరక్క పనులు ఆగిపోయాయని, వేల మందికి ఉపాధి పోయిందన్నారు. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ సౌమ్య ఫైర్ అయ్యారు.