తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గరలో గోదావరిలో మునిగిన బోటును వెలికితీసే ప్రక్రియలో పురోగతి కనిపిస్తోంది. వశిష్ట బోటుకు లంగరు తగిలిందని ధర్మాడి సత్యం బృందం సభ్యులు చెబుతున్నారు. దీంతో లంగరుకు బలమైన ఐరన్ రోప్‌ను జోడించి... బోటును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇదే దశలో రోప్ తెగిపోవడంతో.. ప్రయత్నాలు నిలిచిపోయాయి. అయితే ఈ సారి మాత్రం కచ్చితంగా బోటును తీస్తామన్న ధీమాతో సత్యం బృందం కనిపిస్తోంది.