సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో రైతులు ఆందోళనబాట పట్టారు. నాసిరకం విత్తనాలు పంపిణీ చేస్తున్నారంటూ అధికారులను నిలదీశారు అన్నదాతలు. జమ్మలమడుగు మండల కేంద్రంలో రైతులకు రాయితీపై శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. అయితే అవి నాసిరకంగా ఉన్నట్టు గుర్తించిన రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా స్పందించలేదు. దీంతో ఆందోళనబాట పెట్టారు.
అధికారులు విత్తనాలను పరిశీలించకుండానే సరఫరా చేస్తున్నట్టు రైతులు ఆరోపించారు. తమకు నష్టం వస్తే ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలు మోసం చేస్తున్నాయని ఆరోపణలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం రాయితీపై ఇచ్చే విత్తనాల్లో కూడా ఇలా నాసిరకం సరఫరా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు రైతులు.