కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలో అధికార పార్టీ వర్గీయులు బీభత్సం సృష్టించారు. కోడిగుడ్ల టెండర్లు దక్కించుకునే విషయంలో వివాదం తలెత్తడంతో... ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. DEO ఆఫీసు ఎదుట ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు.
ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా... జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దుండగులు... DEO ఆఫీసులోకి కూడా చొరబడడంతో... సిబ్బంది హడలిపోయారు. పోలీసుల రాకతో దుండగులు పరార్ అయ్యారు. ఘటనను వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధుల సెల్‌ఫోన్లు సైతం ఆగంతకులు లాక్కెళ్లారు.