తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో ప్రమాదానికి గురైన వశిష్ట బోటు వెలికితీత.. టీవీ సీరియల్‌లా మారింది. ఎన్నో ఆశలతో రెండో దఫా వెలికితీత పనులు మొదలు పెట్టిన ధర్మాడి సత్యం బృందానికి మరోసారి నిరాశ ఎదురైంది. బోటుకు లంగరు వేసి ఇనుప రోప్ అనుసంధానం చేశారు. అయితే దాన్ని లాగే క్రమంలో లంగరు పట్టు తప్పింది. దీంతో వెలికితీత పని మళ్లీ మొదటికొచ్చింది. ఘటన స్థలంలో చీకటి అలుముకోవడంతో... వెలికితీత పనులను బుధవారానికి నిలిపివేస్తున్నట్లు ధర్మాడి సత్యం బృందం ప్రకటించింది. మళ్లీ గురువారం పనులను కొనసాగిస్తామని చెప్పారు.