పార్టీని వీడినవారు చంద్రబాబుని విమర్శించే హక్కు లేదన్నారు టీడీపీ నేత దేవినేని ఉమ. మీ స్వార్ధ ప్రయోజనాలు మీరు చూసుకోండన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా... చెక్కు చెదరని పార్టీ టీడీపీ అన్నారు దేవినేని ఉమ. 2007లో వైఎస్సాఆర్ ప్రభుత్వం ... వ్యతిరేక వార్తలు రాస్తే శిక్ష వేయాలని జీవో తెచ్చారని, కానీ... తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో.. దాన్ని వెనక్కి తీసుకున్నారన్నారు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ అదే తరహా నిర్ణయాన్ని క్యాబినెట్‌లో తీసుకున్నారన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ నిర్ణయాలు ఉన్నాయన్నారు.