ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 2020 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులను సూచించారు. పరీక్షల నిర్వహణలో కూడా ఎలాంటి లోటు పాట్లు జరగకుండా చూడాలని అధికారులతో అన్నారు. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పారు. పోస్టుల భర్తీలో మొదటి ప్రాధాన్యత అత్యవసర విభాగాలకు ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునే ఆలోచన ఉందని సీఎం అధికారులతో చెప్పారు.