వారు కూడా మద్దతు తెలిపితే ఉదృతం అవ్వొచ్చు: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు వ్యాఖ్యలు

Update: 2019-10-18 10:16 GMT

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్టీసీకి కొత్త ఎండీని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త ఎండీని నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని వివరణ ఇచ్చిన ప్రభుత్వం..సమర్ధవంతమైన ఇంఛార్జే ఉన్నాడని వాదనలు వినిపించింది. సమర్ధవంతమైన ఇంఛార్జీ ఉంటే అతనినే ఎండీగా ఎందుకు నియమించలేదని హైకోర్టు ఎదురుప్రశ్న వేసింది. ఆర్టీసీ కార్మికులు 2వారాలుగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంది హైకోర్టు. కార్మికుల డిమాండ్లలో ఒక్కదాన్ని కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వలేదంది. ఆందోళనను ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోందని ప్రశ్నించింది హైకోర్టు. ఆర్టీసీకి మరికొంతమంది మద్దతు తెలిపితే పరిస్థితి అదుపు తప్పుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Similar News