ఆపరేషన్‌ వశిష్ట.. మరింత ముందుకు వచ్చిన బోటు

Update: 2019-10-19 05:19 GMT

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద రాయల్‌ వశిష్ట బోటు కోసం ధర్మాడి సత్యం బృందం చేస్తున్న సెర్చ్‌ ఆపరేషన్‌ 5వ రోజు కొనసాగుతోంది. గోదావరిలో 50 అడుగుల లోతులో ఒడ్డుకు దాదాపు 8 వందల మీటర్ల దూరంలో బోటు ఉన్నట్టు గుర్తించారు. బోటు వెలికితీత ప్రయత్నాలు ఈ రోజు ఫలించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

శుక్రవారం ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నంలో బోటు 75 అడుగులు ముందుకు వచ్చింది. రాయల్‌ వశిష్ట బోట్‌ను బయటికి తీయడానికి రెండు లంగర్లు, రెండు భారీ ఐరన్‌రోప్‌లు, రెండు భారీ నైనాల్‌ రోప్‌లతో ఉచ్చువేసి బయటికి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

బోటులో మరికొన్ని మృతదేహాలు చిక్కుకుని ఉండవచ్చని బాధితుల కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. కనీసం ఈ రోజైన తమవారి ఆచూకీ లభిస్తుందని ఆశతో ఉన్నారు.

Similar News