హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో గెలుపు మాదే : మంత్రి కేటీఆర్‌

Update: 2019-10-21 14:52 GMT

తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. భారీగా ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్‌, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ మధ్య బహుముఖ పోరు తప్పదని తొలినుంచీ అంచనా వేశారు. అయితే.. అధికార, సిట్టింగ్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు స్పష్టమవుతోంది. అయితే.. టీడీపీ, బీజేపీ ఎవరి ఓట్లకు గండి కొట్టాయనే అంశంపై గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు.. తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు ఖాయమైందని టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఇన్నిరోజులుగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

Similar News