యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగి చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. ఈబస్సు పరకాల డిపోకు చెందినదిగా గుర్తించారు.