తిరుమలలో గంటపాటు భారీ వర్షం కురిసింది. గ్యాప్ లేకుండా కురిసిన వర్షానికి తిరుమలలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెట్లపై పారుతున్న వర్షపు నీరు జలపాతాన్ని తలపిస్తోంది. రెండో ఘాట్ రోడ్డలో తిరుమలకు వచ్చే ప్రయాణికులఅను అప్రమత్తం చేస్తున్నారు టీటీడీ అధికారులు. కొండచెరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మొదటి ఘాట్ రోడ్డులోనూ భక్తులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ఇక శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. బయట ఉన్న భక్తులు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన షెడ్లలో తలదాచుకున్నారు. తిరుమలలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి.