TTD Gold Theft Row : పెంచలయ్య విషయంలో 'సాక్షి' మీడియా తప్పుడు రాతలు..!

Update: 2026-03-11 08:22 GMT

టీటీడీలో వైసీపీ హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయి. అందులో పెంచలయ్యవ ఇష్యూ కూడా ఉంది. టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు తిరుపతికి చెందిన పెంచలయ్య అనే ఉద్యోగిని పరకామణిలో కాంట్రాక్టు ఉద్యోగిగా తీసుకున్నారు. ఆయన 2023 నుంచే టీటీడీ నుంచి బంగారం కొద్ది కొద్దిగా చోరీ చేశాడు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు గారు అయిన తర్వాత.. ఈ పెంచలయ్యను 2025 జనవరి 11న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ ఎత్తుకెళ్తుండగా పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. అతను 555.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులను ఎత్తుకెళ్లినట్టు ఒప్పుకున్నాడు. తాను కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పించేందుకు భూమన కరుణాకర్ రెడ్డికి రూ.3 లక్షల లంచం ఇచ్చినట్టు కూడా ఒప్పుకున్నాడు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది.

అయితే ఇప్పుడు దాన్ని పట్టుకొచ్చి సాక్షి మీడియా పెద్ద వార్త రాసేసింది. కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత భారీ ఎత్తున దొంగతనం అని.. పెంచలయ్య విషయాన్ని హైలెట్ చేయాలని చూసింది. మీడియా అంటే ప్రజలకు నిజాలు చెప్పాలి. అంతేగానీ అడ్డగోలు అబద్దాలు కాదనేది సాక్షి మీడియా గుర్తుంచుకోవాలి. కరుణాకర్ రెడ్డి హయాంలోనే అతను దొంగతనాలు చేస్తున్నట్టు తేలిపోయింది. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు 2024 నవంబర్ లో బాధ్యతలు తీసుకున్న తర్వాత.. 2025 జనవరిలోనే పెంచలయ్యను పట్టుకున్నారు.

వైసీపీ హయాం నుంచే అతను దొంగతనాలు చేస్తుంటే చూసీ చూడనట్టు వదిలేశారు. కానీ బీఆర్ నాయుడు గారు మాత్రం వదిలేయకుండా అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేలా చేశారు. కానీ సాక్షి మీడియా మాత్రం బీఆర్ నాయుడి గారి హయాంలోనే దొంగతనాలు జరుగుతున్నాయి ఈ పెంచలయ్య పెద్ద ఎత్తున బంగారం ఎత్తుకెళ్లాడు.. భద్రతా వైఫల్యం అంటూ నానా రకాల హంగామా చేస్తోంది. ఇదెలా ఉంది అంటే దొంగే నీతులు చెప్పినట్టు అంటున్నారు తిరుమల శ్రీవారి భక్తులు.


Full View

Tags:    

Similar News