YS Jagan : జగన్ చుట్టూ కేసుల ముప్పు.. వైసీపీ తప్పుడు ప్రచారాలు..

Update: 2026-03-11 09:00 GMT

మాజీ సీఎం జగన్ కు ఇప్పుడు కేసుల ముప్పు భయం పట్టుకుంది. ఇప్పటికే అనేక కేసుల్లో వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు. ఈ కేసుల్లో అంతిమలబ్దిదారుడు ఎవరనేది బహిరంగ రహస్యం. ఈ కేసుల్లో ఇప్పుడు అంతిమ లబ్దిదారుడి వైపు వేగంగా విచారణలు జరుగుతున్నాయి. దీంతో జగన్ కు ఈ కేసుల భయం పట్టుకున్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. ఓ కల్తీ లిక్కర్ కేసు, కల్తీ నెయ్యి కుంభకోణం, లిక్కర్ స్కామ్, పరకామణి కేసుతో పాటు రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిల్లో విచారణలు అత్యంత వేగవంతం అవుతున్నాయి. దీంతో వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ మధ్య పీపీపీ విధానం మీద.. ఆ తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టడం.. ఇప్పుడు టీటీడీలో లేనిపోని తప్పుడు ప్రచారాలు చేయడం.

టీటీడీలో మొన్న ఇందాపూర్ డెయిరీకి నెయ్యి టెండర్లు ఇస్తే.. ఆ డెయిరీకి హెరిటేజ్ తో సంబంధాలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారాలు చేశారు వైసీపీ నేతలు. ఇందాపూర్ తో హెరిటేజ్ కు ఎలాంటి సంబంధం లేదని తేలడంతో దెబ్బకు వైసీపీ సైలెంట్ అయింది. ఇది సరిపోవట్లేదని.. ఏకంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి గారిపై నిందలు వేయాలని చూశారు. కొన్ని ఫొటోలను తప్పుగా ఎడిట్ చేసి.. ఏఐతో వీడియోలను డిజైన్ చేసి రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు.

వాటిపై బీఆర్ నాయుడు గారు సీరియస్ అయి కేసులు పెట్టారు. ఆ వీడియోల్లో ఉన్న మహిళ కూడా వైసీపీ తప్పుడు ప్రచారాలపై కేసులు పెట్టారు. ఇంకేముంది వైసీపీ మళ్లీ సైలెంట్ అయింది. ఇన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేసినా వాటికి మైలేజ్ రావట్లేదని జగన్ బ్యాచ్ తల పట్టుకుంటోంది. జగన్ ఇలా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేయించినా ప్రజలు నమ్మరు అనే విషయాలను గుర్తుంచుకోవాలి. కానీ ఎన్ని సార్లు అడ్డంగా దొరికిపోతున్నా సరే వైసీపీ తప్పుడు ప్రచారాలు ఆపకపోవడం వారి విజ్ఞతకు నిదర్శనం.

Tags:    

Similar News