తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో భారీ ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి కళాశాలలోని ఓ గదిలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో విద్యార్ధుల్ని హుటాహుటిన బయటికి పంపేశారు అధ్యాపకులు. అటు విద్యుత్ అధికారులు సైతం వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో.. పెద్ద ముప్పు తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు కళాశాల సిబ్బంది.