చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్ల గణేష్‌పై కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నిన్న జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పేందుకు పోలీస్‌స్టేషన్‌కు రాగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అర్థరాత్రి అతడ్ని కడపకు తరలించిన పోలీసులు గురువారం కడప కోర్టులో హాజరుపర్చనున్నారు.
2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్‌రూ.10 లక్షలు అప్పు తీసుకున్నారు. ఈ డబ్బు తిరిగి గణేష్ ఇవ్వకపోవడంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది.