హుజూర్‌నగర్‌లో వార్ వన్‌సైడ్ అని తేలిపోయింది. తొలి రౌండ్ నుంచే TRS అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలిరౌండ్‌లో 2467 ఓట్ల ఆధిక్యం వస్తే.. 8వ రౌండ్ వరకూ ఆ జోరు కొనసాగింది. ఇప్పటికి17వేల 400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హుజూర్‌నగర్‌లో ఈసారి టీఆర్‌ఎస్ జెండా ఎగరేయడం ఖాయం కావడంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి MPగా గెలవడంతో ఆయన MLA పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి పోటీ చేస్తే.. TRS నుంచి సైదిరెడ్డి బరిలోకి దిగారు. గతంలో పలుమార్లు ఓటమి పాలైనా సింపతీతోపాటు, KCR మార్క్ మ్యాజిక్ పనిచేసింది.