హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మూడో రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 6520 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సోమవారం జరిగిన పోలింగ్‌లో నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండల్లాలోని 302 పోలింగ్ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి.