భార్య మరణాన్ని జీర్ణించుకోలేని ఓ భర్త... కుమార్తెను చంపి, ఆత్మహత్య చేసుకున్నాడు. నెల వ్యవధిలో కుటుంబం కకావికలమైన విషాదం.. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో చోటు చేసుకుంది. నాళం వారి వీధికి చెందిన చందు భార్య శ్రీనవ్య డెంగ్యూతో మృతి చెందింది. ఆమె కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచాడు చందు. అదే సమయంలో తాను తీవ్ర వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల కుమార్తె యోషితను చంపి, బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు.