తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. ఈ సమావేశంలో మంత్రులు పేర్ని నానితోపాటు కొడాలి నాని కూడా పాల్గొన్నారు. నిన్న చంద్రబాబును కలిసిన వంశీ.. ఈరోజు సీఎం జగన్‌తో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాజా భేటీతో వంశీ పార్టీ మారడం ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. అయితే, తనపై పెడుతున్న కేసుల విషయంపై చర్చించేందుకే సీఎంను కలిసినట్లుగా వంశీ చెప్పుకొచ్చారు.