అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి పనులపై సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సమీక్ష నిర్వహించారు. హిందూపురం పట్టణంలోని తన నివాసంలో అధికారులతో ఆయన భేటీ అయ్యారు. పట్ణణంలో నెలకొన్న సమస్యలు.. నీటి ఇబ్బందులపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు పార్టీ నేతలను కలిసిన బాలయ్య.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి.. బలోపేతానికి దిశా నిర్దేశం చేశారు. అలాగే పట్టణంలో ఓ వికలాంగుడికి మూడు చక్రాల బైక్‌ను పంపిణీ చేశారు.