ఏపీ రాజధానిపై మంత్రి బొత్స వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. కోప, తాపాలుంటే రాజకీయాల్లో చూసుకోవాలని సూచించారు. మీ నిర్ణయాల వెనుక కోట్ల మంది ప్రజలు ఉన్నారని మరచిపోవద్దన్నారు. అసలు రాజధాని కడతారా, కట్టరా.. హైకోర్టును రాయలసీమకు తరలిస్తారా వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ ప్రశ్నించారు.