కాలం చెల్లిన మందులు ఇచ్చి ప్రాణాలు తీశారంటూ సూర్యాపేటలోని కరుణా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు రోగి బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్లపై, ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
ఆర్టీసీలో కాంట్రాక్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్న చామకూరి సందీప్ తండ్రి ఇటీవల మరణించారు. తీవ్రమానసిక ఘర్షణకు లోనై సందీప్ అస్వస్థతకు గురయ్యాడు. జ్వరం రావడంతో సందీప్‌ను కరుణా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందించే క్రమంలో ఇచ్చిన ఇంజెక్షన్‌తో శరీరమంతా ఇన్‌ఫెక్షన్ వచ్చిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత సందీప్‌ను నిమ్స్‌కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. సందీప్ మృతికి కారణమైన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.