కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువకులు గల్లంతు

Update: 2019-10-26 13:51 GMT

నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలం రేవోజీపేటలో.. కడెం ప్రధాన కాల్వలోకి ఓ కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు, స్థానికులు కారును వెలికి తీశారు. గల్లంతైన యువకులు జిన్నారం మండల కేంద్రానికి చెందిన శశాంక్‌, సాయి సంగీత్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News