హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు చంద్రబాబుకి స్వాగతం పలికారు. ఇటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు అక్కడికి చేరుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.