ఇసుక కొరతపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు భవన నిర్మాణ కార్మిక సంఘాల నేతలు. నవంబర్ 1న విజయవాడలో భారీ సభ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి మంత్రులను కూడా ఆహ్వానించారు యూనియన్ నాయకులు. నవరత్నాలపై పెట్టిన శ్రద్దలో సగమైనా ఇసుక సరఫరాపై పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా 5గురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఏపీ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ చెబుతోంది. ఇసుక కొరత కారణంగా లక్షలమంది ఉపాథి పోయిందన్నారు.