ఆర్టీసీ సమ్మెపై విచారణ రేపటికి వాయిదా

Update: 2019-10-28 11:44 GMT

ఆర్టీసీ సమ్మెపై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. రేపు మధ్యాహ్నం రెండున్నరకు మరోసారి విచారిస్తామన్న తెలిపింది. అయితే ఎల్లుండి వరకు గడువు కావాలని ప్రభుత్వం కోరినప్పటికీ కుదరదని స్పష్టం చేసింది న్యాయస్థానం. అంతకుముందు సమ్మెపై ఇరువర్గాలు వాడివేడి వాదనలు వినిపించాయి. హైకోర్టు కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది..

కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం వైఖరిని తప్పుపట్టింది హైకోర్టు. డిమాండ్లు తీర్చడం సాధ్యంకాదని ముందుగానే నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించింది.. టూల్స్, స్పేర్ పార్ట్స్‌, యూనిఫాంలకు బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌పైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. వెంటనే అడ్వేకేట్ జనరల్‌ను పిలవాలని ఆదేశించడంతో.. కోర్టుకు వచ్చారు ఏజీ. ఈడీల కమిటీ నివేదికను కోర్టుకు ఎందుకు సమర్పించలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.. నివేదికులు కోర్టు వద్ద కూడా దాచిపెడతారా అని అసహనం వ్యక్తం చేసింది.

Similar News