ఏలూరులో ఘోరం చోటు చేసుకుంది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. కొత్త బస్టాండ్ వెనుక ప్రాంతంలో ఉన్న ఓ షెడ్డులో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏలూరు పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.