నల్గొండ జిల్లా కేంద్రంలోని SBI బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చోరీకి విఫలయత్నం చేశారు దుండగులు. మెయిన్ గేట్ తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లిన దొంగ... లాకర్లు తెరిచేందుకు ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యపడలేదు. బ్యాంకు గేట్లు తెరిచి ఉండటాన్ని గమనించిన బ్యాంక్ సిబ్బంది... పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.