ఆదిలాబాద్ జిల్లాలో దండారి సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్‌తో పాటు ఎస్పీ విష్ణు, సబ్ కలెక్టర్ గోపి వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. గిరిజనుల ప్రదర్శనలు చూస్తూ వారితో రేలారేలా నృత్యాలు చేశారు కలెక్టర్ దివ్య దేవరాజన్.
దండారి ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఉత్సవాల కోసం ఎమ్మెల్యే ఆత్రం సక్కు చెక్కులు పంపిణీ చేశారు. అంతకు ముందు ఖైర్‌డత్వా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీలను అన్ని విధాలా ఆదుకుంటుందని ఆమె అన్నారు.