ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాలు ఆగడం లేదు. సోమవారం మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాకపోవడంతో మనస్తాపం చెందిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ నీరజ.. తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నీరజ ఆత్మహత్య దురదృష్టకరమని అన్నారు కార్మిక సంఘాల నేతలు.
అటు నీరజ ఆత్మహత్యతో ఆవేశానికి గురైన తోటి ఆర్టీసీ కార్మికులు సత్తుపల్లి ఆర్టీసీ డిపో దగ్గర బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. డిపోలోకి కార్మిక సంఘం, అఖిలపక్ష నాయకులు చొచ్చుకుని వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.