విశాఖ జిల్లా చీడికాడలో కొండ చిలువ... కోళ్లను తింటూ స్థానికులను భయపెడుతోంది. బొడ్డు అప్పలనాయుడు అనే రైతు తన కల్లంలో కోళ్ల ఫాంలో కోళ్ల పెంపకం చేస్తున్నాడు. అక్కడే ఒక చెట్టుపై ఉన్న కొండచిలువ.. రోజూ కోళ్లను తినేస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియని రైతు.. పాములు పట్టే గౌతమ్‌కి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వచ్చిన గౌతమ్ చాకచక్యంగా ఆ పామును పట్టి.. రైతుకు విముక్తి కల్పించాడు.