దగ్గుబాటి ఫ్యామిలీ పాలిటిక్స్‌పై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి. తన భార్య BJPలోనే కొనసాగుతానన్న విషయం.. దగ్గుబాటి వెంకటేశ్వర్రావు YCPలో చేరేప్పుడే ఆ పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పారన్నారు. నాడు దానికి అంగీకరించే దగ్గుబాటిని YCPలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. తనకు ఎన్నికల ముందు జగన్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చిన మాట నిజమే అయినా.. ఇప్పుడు దానిపై ఎలాంటి చర్చా లేదన్నారు. వైసీపీకి రాజీనామా చేయాలంటూ దగ్గుబాటిపై ఒత్తిడి తెస్తున్న విషయంపై ఆయన్నే అడగాలన్నారు.
ప.గో. జిల్లా తాళ్లపూడిలో బీజేపీ సంకల్ప యాత్రలో పురంధేశ్వరి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా అభివృద్ధి తీవ్రంగా కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక విధానాన్ని, పోలవరం పనులు ఆగడాన్ని తప్పుపట్టారు. అధికార వికేంద్రీకరణ అంటే రాజధాని మార్చడం కాదన్నారు.