సెల్ఫీ మోజు.. 70 అడుగుల లోయలో పడిన యువకుడు

Update: 2019-10-29 10:33 GMT

సెల్ఫీ మోజులో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగురపల్లిలోని బోయకొండ ఆలయం వద్ద చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే యువకుడు సెల్ఫీ తీసుకుంటూ అదుపుతప్పి సుమారు 70 అడుగుల లోతు లోయలో పడిపోయాడు. అదృష్టవశాత్తు.. ప్రాణాలతో బయటపడ్డాడు.

లోయలో పడ్డ సత్యనారాయణను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ స్టేషన్‌ సిబ్బంది అతికష్టం మీద సత్యనారాయణను బయటికి తీశారు. ప్రస్తుతం అతడికి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని శరీరంపై 30 చోట్ల గాయాలయ్యాయని తెలిపారు వైద్యులు.

Similar News