చిత్తూరు జిల్లా యాదగిరి మండలం మోర్జనపల్లి ఆంధ్రాబ్యాంక్‌లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంక్‌లో పని చేసే అప్‌రైజర్ రమేష్ ఆచారే దొంగతనానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. రమేష్ నుంచి 18కేజీల బంగారు ఆభరణాలతో పాటు 2 లక్షల 66 వేల నగదు, సీసీ కెమెరాలు, డీవీఆర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌లో 416 మంది కస్టమర్లు తమ నగలను తాకట్టు పెట్టినట్టు రికార్డుల ద్వారా తెలిసింది. దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని రమేష్ ఆల్‌రెడీ కరిగించి వేశాడు. బినామీ పేర్లతో 7కేజీల నకిలీ బంగారు ఆభరణాలను బ్యాంక్‌లో తాకట్టు పెట్టి 1 కోటి 30 లక్షల రూపాయల రుణం పొందాడు.
తాను చేసిన దొంగతనం ఎక్కడ బయటపడుతోందోనని భయపడ్డ రమేష్ మరో మాస్టర్ ప్లాన్ సిద్దం చేసుకున్నాడు. మాస్టర్ డూ ప్లికేట్ కీ తయారు చేయించాడు. బ్యాంక్‌కు రెండు రోజులు సెలవులు రావడంతో బ్యాంక్‌తాళాలు తెరిచి సీసీ కెమెరా,యూపీఎస్ కట్ చేసి నగలు దోచుకుని వెళ్లాడు. బ్యాంక్‌లో దోచుకున్న నగలను తాకట్టు పెట్టిగా వచ్చిన డబ్బును షేర్ మార్కెట్‌లో పెట్టాడు. అందులో నష్టం రావడంతో బ్యాంక్‌లో దొంగతనానికి పాల్పడ్డట్టు పోలీసు విచారణలో తేలింది. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో పాటు సెక్యూరిటీ లోపాలు కారణంగానే రమేష్ దొంగతనం చేయగలిగాడని పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎస్పీ సెంథిల్ తెలిపారు.