కడప జిల్లా రాజంపేటలో ఇసుకమాఫియా రెచ్చిపోయింది. ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించి ఇసుక కోసం వెళితే లోడ్ చేయకపోగా.. నిలదీసినందుకు దళారులు దాడి చేశారు. మందరం ఇసుక ర్యాంపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తాళ్లపాక గ్రామానికి జయసింహరాజు అనే వ్యక్తి ఇసుక కోసం వెళ్లాడు. అప్పటికే సాయంత్రం అయింది.. ఇసుక లోడు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. పైగా ఎలాంటి బిల్లులు లేని వ్యక్తులకు లోడు చేసి పంపుతున్నారు. దీనిపై నిలదీయడంతో రాళ్లతో దాడిచేశారు. వైసీపీకి చెందిన భరత్ రెడ్డి అనే వ్యక్తి దాడికి పాల్పడినట్టు బాధితుడు చెబుతున్నారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫిర్యాదు అందుకున్న మన్నూరు పోలీసులు.. కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.