గమ్యాన్ని చేరుకొని తీరుతాం: ఆర్టీసీ జేఏసీ

Update: 2019-10-30 12:48 GMT

సీఎం కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని అనుకున్నామని.. కానీ, 14 మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరం ఉందని.. ఎవరెన్ని బెదిరింపులకు దిగినా... గమ్యం కచ్చితంగా చేరుకొని తీరుతామన్నారు. సరూర్‌నగర్‌లో జరిగిన ఆర్టీసీ సకల జనభేరి సభకు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా, విద్యార్థి సంఘాలు హాజరయ్యాయి. జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో వచ్చారు. అతి కష్టమ్మీద సభకు అనుమతి వచ్చిందని.. దీన్ని విఫలం చేసేందుకు చాలా ప్రయత్నాలు జరగాయని ఆర్టీసీ జేఏసీ ఆరోపించారు.

Similar News