మెడికల్ షాపులో పేలుడు.. ఇద్దరు మృతి

Update: 2019-10-31 07:59 GMT

గుంటూరు కొత్తపేట శీలంవారి వీధిలోని లాంగ్‌ లివ్‌ మెడికల్‌ షాప్‌ దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. బుధవారం అర్థరాత్రి ఈ పేలుడు సంభవించింది. మెడికల్‌ షాప్‌లో పేలుడులో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి పక్కనున్న షాపులు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో దుకాణ యజమాని రామారావుతోపాటు మరో వ్యక్తి చనిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Similar News