పేద విద్యార్థులకు ఉచిత రైల్వే పాస్‌లు పంపిణీ చేశారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. ఎన్నికల ప్రచారంలో చాలా మంది జిల్లా ప్రజలు రైల్వే పాస్‌లు అడిగారని... అందులో భాగంగానే 4వందల మందికి పంపిణీ చేసినట్టు తెలిపారు. వీటతో ఖమ్మం నుంచి 150 కిలోమీటర్ల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు నామా నాగేశ్వరరావు. 15వ లోక్‌సభలో ప్రవేశపెట్టిన విజ్జత్ పాస్‌లను అప్పుడు ఎంపీగా ఉండగా వేల మందికి ఇచ్చినట్టు నామా గుర్తు చేశారు.