చింతమనేని పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారాయన. జైల్లో ఉన్న చింతమనేనితో మాట్లాడిన అనంతరం ఆయన నేరుగా పెదవేగి మండలం దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు లోకేష్. పార్టీ అన్నిరకాలుగా ఆదుకుంటుందని.. చింతమనేని తరపున న్యాయపోరాటం చేస్తామన్నారు లోకేష్.