తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో డ్రగ్ లైసెన్స్ లేకుండా రోగులకు మందులు ఇస్తున్న జమీల్ అనే ఆర్‌ఎంపీ డాక్టర్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో బ్యాంక్ పేటలో జమీల్ గత కొంత కాలంగా క్లీనిక్ నడుపుతున్నాడు. సదరు డాక్టర్.. డ్రగ్ లైసెన్స్ లేకుండానే రోగులకు మందులు ఇస్తున్నాడు. అంతే కాదు, ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వచ్చిన మందులను విక్రయిస్తున్నాడు. దీంతో సమాచారం తెలుసుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు.. మందులను స్వాధీనం చేసుకొని... జమీల్‌ను అదుపులోకి తీసుకున్నారు.